Sidebar


Welcome to Vizag Express
గుడి రహదారి అడ్డగింతపై గ్రామస్తుల ఆందోళన

04-02-2025 21:21:18

గుడి రహదారి అడ్డగింతపై గ్రామస్తుల ఆందోళన

 భీమిలి రూరల్ వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 4 :
పూర్వకాలము నుండి ఉండే గుడి రహదారికి అడ్డుగా సిమెంట్ పోల్స్ పాతి కంచె వెయ్యడంతో గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు.భీమిలి మండలం వలందపేట,సంగీవలస గ్రామాలకు మధ్య సర్వే నంబర్ 25/6,23/9లో గ్రామాలకు గుడికి వెళ్లే రహదారి ఉందని గ్రామస్తులు తెలిపారు.ఈ దారి గుడికి,అనేక గ్రామస్తులకు ప్రధాన త్రోవగా ఉండేదన్నారు.ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం కొంతమంది వ్యక్తులు ఈ రోడ్డు వాళ్ళుదే అని రోడ్డు అడ్డుగా సిమెంట్ పోల్స్ పాతి కంచె వేయడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసామన్నారు.ఘటన స్థలానికి రెవెన్యూ ఆర్ఐ.మల్లేశ్వరరావు, వీఆర్వో రిజ్వన్,పోలీస్ సిబ్బంది చేరుకుని రికార్డులు పరిశీలించి ఇరు వర్గాలను ఎమ్మార్వో ఆఫీసుకు రావాలన్నారు. అంతవరకు సమన్వయం పాటించాలని కోరారు.