స్టీల్ ప్లాంట్లో సి. ఐ.ఎస్ ఎఫ్ ను తొలగించడం సరికాదు .
04-02-2025 21:23:07
స్టీల్ ప్లాంట్లో సి. ఐ.ఎస్ ఎఫ్ ను తొలగించడం సరికాదు .
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 4
విశాఖ ఉక్కు కర్మాగారం లో అతి కీలక మైన సీ ఐ ఎస్ ఎఫ్ కు చెందిన 438 మంది సిబ్బంది ని తొలగించడం సరైంది కాదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ ,పోరాట కమిటీ నేత వర సాల శ్రీనివాస్ రావు అన్నారు . ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కూర్మ న్న పాలెం కూడలిలో చేపడుతున్న రిలే దీక్షలు మంగళ వారం 1454 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఎల్.ఎం ఎం ,ఎం ఎం ఎస్ ఎం , ఎస్ టి ఎం విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆదినారాయణ, వర సాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై స్పష్ట మైన వైఖరి ప్రకటించకుండా ద్వంద వైఖరి అవలంభిస్తోందని అన్నారు .ఇప్పటికే ఉక్కు ఉద్యోగుల తొలగింపు లో బాగంగా వీ ఆర్ ఎస్ ప్రకటించిందని అన్నారు . నిన్నటికి నిన్న ఉక్కు లో ఎంతో కీలక మైన సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బందిని 438 మందిని తొలగించారని విమర్శించారు . ఉక్కు ఉద్యోగులకు 5నెలలు గా వేతనాలు చెల్లించక పోయినా ,ఉద్యోగులు అంకిత భావంతో ఉక్కు ఉత్పత్తి లో నిమగ్న మవుతున్నారని అన్నారు . ఉక్కు కర్మాగారం అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న ఉద్యోగులకు జీతాలు సకాలం లో చెల్లించ కుండా ,పేర్దంటేజీల రూపం లో జీతాలు చెల్లించడం దుర్మార్గమన్నారు .ఉక్కు లో సి ఐ ఎస్ ఎఫ్ స్థానం లో హోం గార్డులు లను నియమిస్తే ఉక్కు లో అవినీతి ,అక్రమాలు పెరిగే అవకాశం ఉందన్నారు . ఉక్కు సి. ఐ ఎస్ ఎఫ్ వద్ద అధునాతన ఆయుధాలతో పాటు ఉక్కు రక్షణ కు ఎంతోకీల కంగా విధులు నిర్వహిస్తారని అన్నారు . తక్షణమే ఉక్కు యాజమాన్యం తప్పుడు నిర్ణయాలు మానుకొని ఉక్కు ప్రగతికి కృషి చేయాలని డిమాండ్ చేసారు. ఇంకా ఈ దీక్షల్లో ఏ. ఐ టి యూ సి నాయకులు డి. దేముడు , ఎం .త్రినాధ్ , జి. ఆనంద్ , ఎం.కె వి రాజేశ్వర్ రావు , నంబారు సింహాద్రి , పోరాట కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు