భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు
04-02-2025 21:24:36
భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు పెదగంట్యాడ వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 4 , రథసప్తమి సందర్భంగా 76 వార్డు బాల చెరువు శివాలయం ప్రాంగణంలో వార్డు అధ్యక్షులు శ్రీ జిలకర రమణ మరియు జీలకర భువనేశ్వరి దేవి ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసవి శర్మ,గౌరవ అధ్యక్షులు డేగల వెంకటరమణ, సెక్రటరీ నానాజీ, పిలక శ్రీను, ఎల్ దుర్గా ప్రసాద్ , భవాని, ఎస్ మహేష్, శేఖర్ మరియు గ్రామ మహిళలు అందరు పాల్గొన్నారు