Sidebar


Welcome to Vizag Express
అప్పికొండ సోమేశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్లపై సమావేశం

04-02-2025 21:25:54

అప్పికొండ సోమేశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్లపై సమావేశం              గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 4                           అప్పి కొండ సోమేశ్వరాలయంలో ప్రతి ఏట శివరాత్రికి జరిగే జాతర కు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం సోమేశ్వరాలయంలో అన్ని విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం జరిగింది. విశాఖపట్నం ఆర్డీవో శ్రీలేఖ ఈ సమావేశం లో పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మంది జనాభా ఈ శివరాత్రి యాత్రలో పాల్గొంటారని అంచనా వేశారు. ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజులపాటు అప్పకండి సోమేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి సంబంధించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, జీవీఎంసీ నుంచి సముద్ర తీరంలో టెంట్లు, భోజనాలు, మంచినీటి సౌకర్యం కల్పిస్తారు. వైధ్యా వి భాగం నుంచి రెండు రోజులపాటు ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తారు. మత్స్య శాఖ నుంచి 100 మంది గజ ఈతగాలని తీరంలో ఏర్పాటు చేస్తారు. పెదగంట్యాడ ఉక్కు నగరం నుంచి అగ్నిమాపక శకటలు ఏర్పాటు చేస్తారు. అన్ని విభాగాల నుంచి ఏర్పాట్లు చేసే విధంగా అధికారులకు ఆర్డిఓ సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ, గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, ఈవో శ్రీనివాస్, దువ్వాడ, ఉక్కు నగరం పోలీస్ స్టేషన్లో సిఐలు, ఆర్టీసీ, రెవెన్యూ, మెడికల్, అగ్నిమాపక, దేవాదాయ శాఖ, ఆర్టీసీ, ఫిషరీస్ విభాగం పలు డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. 77 వ వార్డు పరిధిలోని అప్పికొండ, పాలవలస, కేఎన్ పాలెం, చినపాలెం, దేవాడ గ్రామాల పరిధిలో నుంచి గ్రామ పెద్దలు హాజరయ్యారు. ఈనెల, 26, 27 తేదీల్లో రెండు రోజులు పాటు హ్యాపీ కొండ సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.