ప్రజల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేయాలి
-మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఎంపీపీ గోవింద్
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 4:
వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో తన కార్యాలయంలో మంగళవారం నాడు యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ కలిశారు.పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉండాలని, దానితో పాటుగా యలమంచిలి మండలం,పట్టణంలో కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ,ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని జగన్ చెప్పినట్లు గోవింద్ తెలిపారు.ప్రతీ ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారని ఆయన అన్నారు.