Sidebar


Welcome to Vizag Express
పట్టణంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

04-02-2025 21:31:01

పట్టణంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 4:
పట్టణంలో గోల్లలకొండపై కొలువైయున్న  సూర్య నారాయణ స్వామి ఆలయంలో మంగళవారం నాడు రధసప్తమి వేడుకలు పుజారులు ఘనంగా నిర్వహించారు.వేకువజామునుండే భక్తులు సూర్యభగవానునికి సూర్య నమస్కారాలు, ప్రత్యేక పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా పంచామృతాలాతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.  రథసప్తమి  అంటే సూర్యభగవానుని పూజించే పండగని మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా భక్తులు ఘనంగా నిర్వహించుకొని స్వామివారిని దర్శించుకుంటారని అర్చకులు శిష్ట్లా సాయి, ప్రసన్నలు తెలియజేశారు.రథసప్తమి  సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు  స్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ వారు జాగ్రత్తలు తీసుకున్నారు.