Sidebar


Welcome to Vizag Express
వైభవోపేతంగా శ్రీ శ్రీ పరదేశమ్మ పండుగ మహోత్సవం

04-02-2025 21:32:10

వైభవోపేతంగా శ్రీ శ్రీ పరదేశమ్మ పండుగ మహోత్సవం
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 4:
మున్సిపాలిటీ పరిధి పెద గోల్లలపాలెం  గ్రామంలో కొలువైయున్న శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి గుడి వద్ద జాతరమహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు.భక్తులు  తెల్లవారుజాము నుండే ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,భారీఎత్తున   ఊరేగింపుగా  వచ్చి అమ్మవారికి సారె,పసుపు, కుంకుమలు సమర్పించి,తమ మొక్కులను తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన  సాంస్కృతిక ప్రదర్శనలు,భారీ బాణసంచాలు చూపరులను ఆకట్టుకున్నాయి.జాతర మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో  ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నా