Sidebar


Welcome to Vizag Express
ఏలియా మాస్టారు భౌతిక కాయానికి నివాళులర్పించిన

04-02-2025 21:38:04

ఏలియా మాస్టారు భౌతిక కాయానికి నివాళులర్పించిన

అరకు మాజీ ఎమ్మెల్యే
చెట్టి ఫాల్గుణ 

అరకులోయ,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,04: మండలంలో అరుకువేలి పరిది శరభగుడ గ్రామ కొర్ర ఏలియా మాస్టారు, సోమవారం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో స్వగ్రామమైన సర్వ గోడలు మంగళవారం ఏర్పాటు చేసిన అంత్యక్రియల్లో  మాజీ శాసనసభ్యులు చెట్టి పాల్గుణ గ్రామంలో చేరుకొని భౌతిక కాయాన్ని నివాళులర్పించారు. కొద్దిరోజుల ముందు ద్విచక్ర వాహనంతో స్వీయ ప్రమాదం ఎదుర్కొని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబంతో నా విద్యార్థి దశ నుండి మంచి సత్సంబంధాలు ఉన్నాయని గొప్ప ఉపాధ్యాయుడిని కోల్పోయామని వారి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ శాసనసభ్యులు తో పాటుగా వైసిపి నాయకులు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, తదితరులు, అనేకమంది పాల్గొని మృతదేహానికి నివాళులర్పించారు