Sidebar


Welcome to Vizag Express
గృహల సర్వే వేగవంతం చేయాలి

04-02-2025 21:39:27

గృహల సర్వే వేగవంతం చేయాలి

గిరిజన ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాల గిరిజనులకు గృహాలు మంజూరు చేయాలి

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,04: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి గ్రామీణ అవస్ యోజన గృహాలు  గిరిజన ప్రాంత సామాజిక వర్గాల ఆదివాసి గిరిజనులకు మంజూరు చెయ్యాలని, గృహాలకు సర్వే వేగవంతం చేసి జనరల్ సామాజిక తరగతుల వారందరికి  తక్షణమే బిల్లులు చెల్లించాలని సిపిఎం పార్టీ ముంచింగిపుట్టు మండల వైస్ ఎంపీపీ పాటు బోయి సత్యనారాయణ గిరిజన సంఘం సీనియర్ నాయకులు సొలగం రాసిరం దొర, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం ఎం శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ హౌసింగ్ సర్వే మరియు జియో టేకింగ్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న సిబ్బంది పంచాయతీ లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పర్యవేక్షిస్తూ హౌసింగ్ సర్వే చేయడానికి సాధ్యం కావడం లేదని సమయం సరిపోవటం లేదని ప్రత్యేకంగా హౌసింగ్ సర్వేకు జిల్లా కలెక్టర్ స్పందించి సిబ్బందిని పెంచి సర్వే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మంజూరు చేసిన ఎన్టీఆర్ గృహాలకు కూడా బిల్లులు చెల్లించాలని ప్రతి గృహానికి 500000 నిధులు ఖర్చుపెట్టి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.