Sidebar


Welcome to Vizag Express
ప్రమాద భరితంగా ఆర్ అండ్ బి ప్రధాన రహదారి

04-02-2025 21:40:50

ప్రమాద భరితంగా ఆర్ అండ్ బి ప్రధాన రహదారి 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,04: మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కించాయిపుట్టు గుమ్మ సిరగం పుట్టు గ్రామ సమీపంలో గల జోలపుట్టు ఆర్ అండ్ బి ప్రధాన రహదారి కోతకు గురయి ప్రమాద భరితంగా మారడంతో వాహన చోదకులు భయం గుప్పెట్లో రాకపోకలు సాగిస్తున్న వైనం. పంచాయతీ కేంద్రానికి కూత వేటు దూరంలో గల గుమ్మ సిరగం పుట్టు గ్రామ సమీపంలో పాడేరు, ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్ ప్రధాన ఆర్ అండ్ బి రహదారి భారీ వర్షాలకు వరద ఉధృతికి కోత గురై ప్రమాద భరితంగా మారినప్పటికీ సంబంధించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఆ మార్గన రాకపోకలు సాగించే వాహన చోదకులు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు. ఆ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణం సాగించాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకుని రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పరిస్థితి ఈ విధంగా ఉంటే మారుమూల గ్రాముల రహదారి పరిస్థితి మరి అద్వానంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోగలు సాగిస్తూ భయం గుప్పెట్లోనే వెళ్లే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ వాహనాలు ప్రైవేట్ వాహనాలు అలాగే జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు జిల్లా చైర్మన్లు ఆ రహదారి గుండా వివిధ కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తున్న వారు కూడా పట్టించుకోకపోవడం లేదని పలువురు విచార వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి గుమ్మ స్వర్గంపుటు గ్రామ సమీపంలో కోతకు గురైన ప్రధాన రహదారి మరమ్మత్తులు చేపట్టాలని లేనియెడల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని ఆ ప్రాంత వాహన చోదకులు పేర్కొంటున్నారు.