నాల్గోవ రోజు గాలింపు చర్యల్లో అమిత్ కుమార్ మృతదేహం లభ్యం
మరో విద్యార్థి శివ ఆచూకి ముమ్మరంగా గాలింపు చర్యలు
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,04: అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం జోలపుట్టు జలాశయంలో ఒడిస్సా ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు శనివారం నాటు పడవ బోల్తా పడి జలాశయంలో గల్లంతయిన విషయం తెలిసిందే. దీంతో గత నాలుగు రోజులుగా అలుపెరగకుండా ఓడి ఆర్ ఎ ఎఫ్ బృందం అగ్నిమాపక బృందం జలాశయంలో గాలింపు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ నాలుగో రోజు మంగళవారం మధ్యాహ్నం జోలాపుట్టు ఆర్ఎఫ్ కు వంతల గోవర్ధన్ కుమారుడు అమిత్ కుమార్ మృతదేహం ఎట్టకేలకు వెలికి తీశారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పార్వతి చేతుల మీదుగా 20 వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం కింద ఆ కుటుంబానికి అందించారు. కనిపించని మరో విద్యార్థి శివ ఆచూకీ కొరకు ఓడి ఆర్ ఏ ఎఫ్ అగ్నిమాపక బలగాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు.దీంతో మరో విద్యార్థి శివ మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.