Sidebar


Welcome to Vizag Express
ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని విస్త‌రించాలి

04-02-2025 21:44:20

విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 4

ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని విస్త‌రించాలి
జిల్లా స‌మాఖ్య ద్వారా క‌షాయాల విక్ర‌యం
జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌
 జిల్లాలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని విస్త‌రించడానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. ఖ‌రీఫ్ 2025లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప్ర‌ణాళిక‌పై క‌లెక్ట‌రేట్‌లో వివిధ శాఖ‌ల అధికారుతో సంయుక్త స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం జిల్లాలో జ‌రుగుతున్న ప్ర‌కృతి సేద్యం, దాని విస్త‌ర‌ణ‌, ఆవ‌శ్య‌క‌త‌, ఉప‌యోగాలు, నూత‌న ప్ర‌యోగాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. వ్య‌వ‌సాయ‌శాఖ జెడి విటి రామారావు, ఎపి క‌మ్యూనిటీ మేనేజ్డ్ నేచుర‌ల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్టు మేనేజ‌ర్ ఆనంద‌రావు మాట్లాడుతూ, జిల్లాలో జ‌రుగుతున్న ప్ర‌కృతి వ్య‌వ‌సాయం గురించి వివ‌రించారు.

                    క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ మాట్లాడుతూ, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను సామాన్య రైతుల‌కు మ‌రింత చేరువ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. దీనికోసం వారికి సులువుగా అర్ధ‌మ‌య్యే ప‌ద్ద‌తుల్లో, సుల‌భమైన ప‌దాల‌ను అందుబాటులోకి తేవాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలోని 27 మండ‌లాల్లో 54 యూనిట్లు ఉన్నాయ‌ని, 220 గ్రామ పంచాయితీల్లో ప్ర‌కృతి సేద్యం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఈ గ్రామాల్లోని 9716 మ‌హిళా సంఘాలు భాగ‌స్వామ్యం అవ్వ‌గా, ఈ సంఘాల్లోని మొత్తం 1,12, 151 మంది స‌భ్యులు ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం 59,279 మంది మ‌హిళ‌లు మాత్ర‌మే సుమారు 80వేల ఎక‌రాల్లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను అనుస‌రించ‌డం గానీ, అనుస‌రించ‌డానికి ముందుకు రావ‌డం గానీ జ‌రిగింద‌ని తెలిపారు. మిగిలిన వారంద‌రూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసేవిధంగా వారిని చైత‌న్య‌ప‌ర‌చాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం 28 శాతంగ