Sidebar


Welcome to Vizag Express
జిఎంఆర్ ఐటీ కి ప్రపంచ స్థాయి గుర్తింపు

04-02-2025 21:46:22

జిఎంఆర్ ఐటీ కి ప్రపంచ స్థాయి గుర్తింపు 
కృషి చేసిన అందరికి అభినందనలు చెప్పిన  యాజమాన్యం 
రాజాం. వైజాగ్ ఎక్స్ ప్రెస్. ఫిబ్రవరి 4


ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ లలో జీఎంఆర్ ఐటీ  కి గుర్తింపు లభించింది.
 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్  సబ్జెక్ట్  వారీగా ఇచ్చిన  వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్  2025 లో ఇంజినీరింగ్ విభాగంలో రాజాం జిఎంఆర్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ    చోటు దక్కించుకున్నట్లు   జి.ఎం.ఆర్.ఐ.టి. మేనేజ్మెంట్ మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 కోసం  97 దేశాల నుండి వివిధ  ప్రాంతాలకు చెందిన 1488 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయాన్నారు. ఈ పరిశీలన లో  18 కఠినమైన పనితీరు సూచికల ఆధారంగా విశ్లేషించి ర్యాంకింగ్ లను ఇచ్చారని వారు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎంఐటీ , ఆక్స్ఫర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు  తమ అగ్ర స్థానాలను కొనసాగించగా, ఉన్నత విద్య రంగంలో పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తూ భారతదేశం నుంచి 87 విద్యా సంస్థలు ర్యాంకింగ్స్ పొందాయని  అన్నారు.  
ఆంధ్ర ప్రదేశ్ నుంచి 7 విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యాసంస్థలు ఈ ర్యాంకింగ్లో చోటు సంపాదించగా  వాటిలో అటానమస్ విద్య సంస్థ అయిన జీఎంఆర్ ఐటీ   ర్యాంకింగ్ ను దక్కించుకొని  ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు.
ఈ గుర్తింపు ద్వారా తన  పరిశోధనలలో నైపుణ్యతను, విద్యా విధానం లో నవీకరణల పట్ల అంకిత భావాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ ఘనతను సాధించడంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారన ఈ సందర్భంగా వారికి జి.ఎం.ఆర్.ఐ.టి. మేనేజ్మెంట్  అభినందనలు తెలిపారు.