Sidebar


Welcome to Vizag Express
రామ తీర్ధం రధ సప్తంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

04-02-2025 21:47:48

రామ తీర్ధం రధ  సప్తంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
నెల్లిమర్ల :వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి04

నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు రధసప్తమి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ రామతీర్థం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఎమ్మెల్యే కి వేదాశీర్వచనాలు అందజేశారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న లోకం నాగ మాధవి రామతీర్థం ఆలయ మహిమను కొనియాడారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రధసప్తమి పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.