Sidebar


Welcome to Vizag Express
రోడ్ల ఆక్రమిస్తే కఠిన చర్యలు

04-02-2025 21:51:12

రోడ్ల ఆక్రమిస్తే కఠిన చర్యలు
 సి ఐ అశోక్ కుమార్
రాజాం. వైజాగ్ ఎక్స్ ప్రెస్. ఫిబ్రవరి 4

రాజాంలోని ప్రధాన రహదారి ఎవరైన రోడ్డులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజాం అశోక్ కుమార్ హెచ్చరించారు.స్థానిక ప్రభుత్వ కళాశాల మెయిన్ గేట్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై పోలీసు సిబ్బందితో పాటు మున్సిపాలిటీ అధికారులు కలసి  మంగళవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కళాశాల మైదానంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వీటివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, కుళ్ళిన కూరగాయల మరుగుతో అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు.కళాశాల విద్యార్థులంతా మున్సిపల్, పోలీస్ కార్యాలయాలకు వినతులు చేయడంతో మున్సిపల్ సిబ్బంది తో ఆక్రమణలు పరిశీలించి నట్టు తెలిపారు. ఇరు డిపార్ట్మెంట్ ల అధికారులు నేతృత్వంలో రోడ్డు పై వ్యాపారం చేస్తున్న వర్తకులను ఖాళీ చేయించి పాత బస్టాండ్ ఆవరణలో  వారికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఇక పై రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండాలని సూచించారు. రోడ్డును అక్రమించి వ్యాపారాలు చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు . ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.