Sidebar


Welcome to Vizag Express
రహదారి నిర్మాణాల నాణ్యతలో రాజీ పడవద్దు

04-02-2025 21:52:50

రహదారి నిర్మాణాల నాణ్యతలో రాజీ పడవద్దు

 అధికారులను ఆదేశించిన పిఓ అశుతోష్ శ్రీవాస్తవ

పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 4 : పార్వతీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టే సిసి,బీటి రోడ్ల నిర్మాణాల నాణ్యతలో రాజీ పడవద్దని ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండలం హెచ్.కారాడవలస గ్రామంలో సిసి రోడ్, సీతానగరం మండలం నిడగల్లు నుంచి జగన్నాధపురం వరకు వేస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. అనంతరం సీతానగరం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ కార్యక్రమాల ప్రగతి గురించి సమీక్షిస్తూ ఐటీడీఎ పరిధిలో నిర్మించే రహదారి పనుల నాణ్యత ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీపడరాదని, పక్కాగా నిర్మించాలని సూచించారు. ఇచ్చిన లక్ష్యాలను అధికారులు సకాలంలో పూర్తిచేసి అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జోగంపేట స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను  సందర్శించిన ఆయన అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.