Sidebar


Welcome to Vizag Express
సూర్యపీఠంలో ఘనంగా రధసప్తమి పూజలు

04-02-2025 21:54:15

సూర్యపీఠంలో ఘనంగా రధసప్తమి పూజలు 
 బ్రహ్మశ్రీ వేమకోట నరహరి శాస్త్రి 


పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 04:
పార్వతీపురం సూర్యపీఠం లో రధసప్తమి పూజలు మంగళవారం అశేష షేముషీనిధి బ్రహ్మశ్రీ వేమకోట నరహరి శాస్త్రి, కుమారుడు వివేక్ ఆధ్వర్యంలో సూర్యజయంతి (రథసప్తమి)పూజలు ఘనంగానిర్వహించారు.ఈ సందర్బంగా సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనసౌర దీక్షితులచే, దంపతులచే క్షీరాభిషేకం.ఉషా, పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్య భగవానుని కళ్యాణ మహోత్సవంకళ్యాణోత్సవంలో పాల్గొనునున్న భక్తులకు సౌరతీర్ధ ప్రాశన, ప్రసాద వితరణ సాయంత్రం సహస్ర దీపాలంకారసేవశ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులచే భజన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగిణి సభ్యులచే సామూహిక విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణలుఊంజల్ సేవ, పూలంగిసేవఅనంతరం నీరాజన మంత్రపుష్ప స్వస్తి వాచనములు అనంతరం సంవత్సర సౌరదీక్షాంత 52 ఆదివారముల పూర్ణాహుతి పై కార్యక్రమములలో పాల్గొను భక్తులు ముందుగా వారి గోత్రనామములనుశ్రీ సూర్వపీఠ ప్రాంగణములోగల కార్యాలయమందు  భక్తులు సమయపాలన చేసి క్రమశిక్షణతో వ్యవహరించి, స్వయం కార్యకర్తలుగా సేవలందించి తరించ కోరికఉత్సవ నిర్వహణ కమిటీ, సూర్యసేన,సూర్యయోగా సెంటర్ స్వామి సేవా సమితి, అయ్యప్ప సన్నిధానం, శ్రీసూర్యపీఠం సేవలందించారు. ఈ కార్యక్రమం లో మహిళలు భక్తులు పాల్గొని సూర్యనమస్కారాలు ఆచరించి తీర్ధ ప్రసాదలను అందజేశారు.