Sidebar


Welcome to Vizag Express
హంసవాహిని పుస్తక బహూకరణ

04-02-2025 21:57:14

హంసవాహిని పుస్తక బహూకరణ 
                                 పొందూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫబ్రవరి 4: 
తెలుగు రచయితల వేదిక(శ్రీకాకుళం) ఆధ్వర్యంలో తాజాగా ప్రచురించిన హంసవాహిని(కవితా సమాహారం) పుస్తకాన్ని స్ధానిక ఎస్.బి.ఐ చీఫ్ మేనేజర్, తెలుగు భాషాభిమాని సి.హెచ్.ప్రసాదరావుకు స్ధానిక నామ విజ్ఞాన వేత్త,ఎన్.బి.టి క్లబ్ జీవితకాల సభ్యులు వాండ్రంగి కొండలరావు బుధవారం బహుకరించారు.అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు రాసిన ఈ కాలం పిల్లాడు (బాలల నవల)ను కూడా ఈ సందర్భంగా అందజేశారు.తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకోవలసిన గురుతర బాధ్యత సమాజంపై ఉందని చీఫ్ మేనేజర్ ప్రసాదరావు వ్యాఖ్యానించారు.విద్యార్ధులు, తలిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే భాషా సాంస్కృతిక శాఖ గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు తగు కృషి చేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.తెలుగు రచయితల వేదిక సభ్యులను, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు.