ఈఈ. మెరిట్ టాలెంట్ టెస్టులో లో ఎర్రముక్కాం విద్యార్థి.ప్రతిభ
జిల్లా స్థాయిలో రాణించిన నిఖిల్
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 4:
సోంపేట మండలం ఎర్రముక్కాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న భర్తు నిఖిల్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఈనెల 22న జరిగిన ఆన్లైన్ ఈఈ మెరిట్ టెస్టులో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వీతీయ స్థానంలో నిలిచినట్లు హైస్కూల్ హెచ్ ఎం అనంత తెలిపారు . ఇప్పటి దాకా మండల ,డివిజన్ స్థాయిలో నిర్వహించిన పలు టాలెంట్ పరీక్షల్లో అసమాన ప్రతిభను ఈ విద్యార్థి కనబరుస్తూ పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చాడని ఈనెల 8న విజయవాడలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు సీల్డ్ ,ప్రశంసా పత్రం విద్యాశాఖ అధికారులు చేతులు మీదుగా అందుకుంటాడని ఆయన పేర్కొన్నారు .ఇదే మండలం తోటవూరు గ్రామానికి చెందిన నిఖిల్ తల్లి తండ్రులు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వారు. ఈ విద్యార్థి ఎటువంటి శిక్షణ పొందకుండానే మెరిట్ సాధించడం పట్ల పాఠశాల కమిటీ ఛైర్మన్ తోట యాదవరావు ,రిటైర్డ్ హెచ్ ఎం అంబటి కృష్ణ మూర్తి ,ఎర్రముక్కాం ,తోటవూరు ,గ్రామ ,యువజన సంఘాలు విద్యార్థుల తల్లి తండ్రులు అభినందించారు. ఈ విద్యార్థి స్కూల్ తరగతి లో కూడా అనేక ప్రతిభ పాటవాలు చూపిస్తూ ఉపాద్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు.