Sidebar


Welcome to Vizag Express
బారువ తీరంలో పోటెత్తిన భక్తులు! మెరైన్ పోలీసులు బందోబస్తు

04-02-2025 22:09:10

బారువ తీరంలో పోటెత్తిన భక్తులు!

మెరైన్ పోలీసులు బందోబస్తు!

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 4:

సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు.  ప్రతీఏటా ఈ తీరంలో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ,పక్కనే వున్న ఒడిశా నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు చేసి సూర్యభగవానుడుని నమస్కారం చేస్తారని  బారువ మెరైన్ పోలీసులు తీరం వెంబడి బందోబస్తు ఏర్పాటు చేశారు.అనంతరం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. ఎకువూరు ,ఎర్రముక్కాం ,నడుమూరు ,బట్టిగళ్లూరు ,ఇసకలపాలెం ,బేతాళపురం ,చిగలపుట్టుగ తదితర తీర ప్రాంతాలు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు తో పోటెత్తాయి . సముద్రతీరం వద్ద మెరైన్ సి.ఐ. డివిజి. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు