Sidebar


Welcome to Vizag Express
ద‌య‌చేసి వినండి... ఈ స్టేషన్లలో కొత్తగా 26 రైళ్లకు హాల్ట్ లు

04-02-2025 22:10:57

ద‌య‌చేసి వినండి...
ఈ స్టేషన్లలో కొత్తగా 26 రైళ్లకు హాల్ట్ లు 

- ఎక్క‌డెక్క‌డంటే...

ఢిల్లీ, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.  26 ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా కొత్తగా ఇప్పటివరకూ ఆగని స్టేషన్లలో ఆగబోతున్నాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు (17015) ను ఈ నెల 4 నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో ఆపబోతున్నారు. అలాగే నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17232) ను కూడా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో నిన్నటి నుంచి ఆపుతున్నారు. హజరత్ నిజాముద్దీన్-తిరుపతి (12708) రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ నెల 5నుంచి ఆపనున్నారు. అలాగే ఎర్నాకుళం-పాట్నా ఎక్స్ ప్రెస్ (22669)ను ఈ నెల 5 నుంచి ఖమ్మంలో ఆపబోతున్నారు. బీదర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (17009)ని మర్పల్లిలో మంగ‌ళ‌వారం నుంచి హాల్ట్ ఇస్తున్నారు.   అలాగే చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ (23656)ను, అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ (23655)ను సోమ‌వారం  నుంచి పెద్దపల్లిలో ఆపుతున్నారు. అలాగే సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (10705) రైళ్లను మంగ‌ళ‌వారం నుంచి నెక్కొండలో ఆపుతున్నారు. చెన్నై-హజరత్ నిజాముద్దీన్ (12611) రైలుకు ఈ నెల 8 నుంచి వరంగల్ లో హాల్ట్ ఇచ్చారు. అలాగే చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలుకు నిన్నటి నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండలో స్టాపులు ఇచ్చారు. అటు తిరుపతి-లింగంపల్లి (12733) రైలును సోమ‌వారం నుంచి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో ఆపుతున్నారు. అలాగే నరసాపురం-లింగంపల్లి (17255) రైలును సోమ‌వారం నుంచి నల్గొండలో ఆపుతున్నారు. లింగంపల్లి-నరసాపూర్ (17256) రైలును  మంగళగిరిలో ఆపుతున్నారు. పూరీ-తిరుపతి (17479), బిలాస్ పూర్ -తిరుపతి(17481), తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైళ్లను  చిన్న గంజాంలో ఆపుతున్నారు.