లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు
* లక్ష్యాలను సాధించకుండా కథలు చెప్పొద్దు
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
పాడేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 4: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు నీడతోటలు పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్ అన్నారు. రానున్న ఐదేళ్లో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించారని స్పష్టం చేసారు. ప్రతీ సంవత్సరం 20 వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేంచిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసారు. మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ, మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ, పౌర సరఫరాలు, సెరీకల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటపాక,పాడే, కొయ్యూరు, రాజ వొమ్మంగి, గంగవరం, కొయ్యూరు, అడ్డతీగల, వి. ఆర్.పురం మండలల్లో ఫారం పాండ్స్ లక్ష్యాలు అధిగమించాలన్నారు. రబీ సీజన్ ఇ క్రాప్ బుకింగ్ చేయాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన విభాగంలో 98 శాతం ఈ క్రాప్ బుకింగ్ చేసారని అన్నారు. క్రాప్ బుకింగ్ చేసిన మేరకు అథెంటికేషన్ పూర్తి చేయాలని చెప్పారు. వరి, రాజ్యా పంటలకు ఇకెవైసీ వేయించాలని సూచించారు. పి. ఎం.కిసాన్ వెరిఫికేషన్ పక్కాగా చేయాలని ఆదేశించారు.
రెండు వారాల్లో ఇ కేవైసీ, ఇ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలన్నారు. కూన వరం, చింతూరు మండలాల్లో ఉద్యానవన నర్సీలు పెంపకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను అమలు చేయాలని పేర్కొన్నారు. పాడేరు, రంపచోడవరం డివిజన్లలో వెదురు నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. ముంచంగి పుట్టు మండలంలో కేజ్ కల్చర్ రెన్యువేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో మరింత మల్బరీ సాగు విస్తరించాలని చెప్పారు. 200 ఎకరాలలో మల్బరీ సాగు లక్ష్యంగా నిర్దేశించగా 130 ఎకరాల్లో పూర్తి చేసారని, మిగిలినవి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. షెడ్ల నిర్మాణాలకు కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. 25700 టన్నులు ధాన్యం 100 టన్నులు రాగులు టన్నులు సేకరణ చేసారన్నారు. మిగిలిన లక్ష్యాలను అధిగ మించాలన్నారు.
ఈ వీడియో- కాస్ఫరెస్సులో రంపచోడవరం పి. ఓ కె సింహాచలం వర్చువల్ గాను జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి. ఎస్.నంద్, జిల్లా ఉద్యానవన అధికారి ఎ. రమేష్ కుమార్ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సెరీకల్చర్ అధికారి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.