మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి .
05-02-2025 19:24:39
మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి .
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 5,
దేశం లో , రాష్ట్రం లో మహిళలపై , దళిత యువతులు ,మైనర్ బాలికల పై జరుగుతున్న అత్యాచారాలను , లైంగిక దాడులను అరికట్టడం లో పాలక పక్షాలు పూర్తి గా విఫల మయ్యాయని ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గాజువాక లో ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన నుద్దేశించి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. వన జాక్షి మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య లో మహిళపై అత్యాచారం జరగడం జరిగిందని , ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటన పై పూర్తి విచారణ జరిపి దోషులను శిక్షించక పోవడం దుర్మార్గ మ న్నారు . సంఘటన ను ప్రజలు మరువక ముందే విశాఖ నగరం లోని హెచ్ బి కాలనీలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరగడం పట్ల మహిళా సమాఖ్య ఆందోళనను వ్యక్తం చేసిందని అన్నారు . తక్షణమే పాలక పక్షాలు మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించాలని ,లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నేతలు పిల్లా పద్మ , దేవుడమ్మ ,పుష్ప , మహిళలు పాల్గొన్నారు