Sidebar


Welcome to Vizag Express
డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో మెగా రక్తదాన శిబిరం

05-02-2025 19:31:54

డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో మెగా రక్తదాన శిబిరం

భీమిలి, రూరల్ వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 5:
భీమిలి మండలం 2వ వార్డు గొల్లలపాలెం వరుణ్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు ఉమ్మడి. శివరామకృష్ణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రక్తదాన శిబిరానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 76 మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.రక్తం దానం చేసిన ప్రతి ఒక్కరికి ధ్రువీకరణ పత్రాలు,భీమా పత్రాలు ముఖ్య అతిథులు అందజేశారు.ఈ నేపథ్యంలో నీలాపు.శంకర్ రెడ్డికి మానవతావాది పత్రాన్ని అందజేసి సన్మానం చేశారు. కార్యక్రమంలో వరుణ్స్ పీజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ లావేటి వరుణ్ గాంధీ,హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షులు యువరత్న శేఖర్,ఉపాధ్యక్షులు సమంతాపూడి.చైతన్య,రెండవ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు నీలాపు శంకర్ రెడ్డి,మూడో వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు అక్రమాని దివాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.