గంటా ఆధ్వర్యంలో కాకర్లపూడి శ్రీకాంత్ టిడిపిలో చేరిక
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 5.
ఆనందపురం మండలం సీనియర్ నాయకులు కొన్నేళ్ల క్రితం నుంచి వైసీపీలో పాలన వేలిన కాకర్లపూడి వరహాల రాజు, శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులు తో సహా స్థానిక ఎంపీటీసీ తో సహా గ్రామ ప్రజలు కొందరు గురువారం కాకర్లపూడి నివాసంలో వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు ఘంటా శ్రీనివాసరావు సమక్షంలో తన కుటుంబ సభ్యులతో సహా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాకర్లపూడి శ్రీకాంత్ మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు భీమిలిలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి విభేదం లేకుండా అభివృద్ధి సాధించిందని మరల 2024 సంవత్సరంలో గంటా శ్రీనివాసరావు సుమారు 90000 పైగా మెజార్టీతో గెలుపొందారని భీమిలి నియోజవర్గం అభివృద్ధి బాటలో నడిపించడానికి అభివృద్ధి సాధించడానికి నా వంతుగా కృషి చేస్తానని పార్టీ ఏ బాధ్యతని ఇచ్చిన న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభ్యులు సమక్షంలో కనమాం ఎంపీటీసీ గొలగాని కృష్ణ, స్థానిక నాయకులు, మహిళలు, రామవరం ప్రజలు పెద్ద ఎత్తున టిడిపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి కల్చర్ అసోసియేషన్ అధినేత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్,సర్పంచులు
బి ఆర్బి నాయుడు, ఆబోతు అప్పల రాము, సోంబాబు,
జోగ ముత్యాలు,నాయకులు పాల్గొన్నారు