Sidebar


Welcome to Vizag Express
బోణి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

05-02-2025 19:34:07

బోణి  గ్రామంలో  ఉచిత వైద్య శిబిరం 

 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 5.


 ఆనందపురం మండలం బోని గ్రామపంచాయతీలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఆనందపురం మండలం బోణి గ్రామంలో   ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ  పీ.హెచ్. సి మెడికల్ ఆఫీసర్ డి. ర్. గంగు నాయుడు గారు  పాల్గొని 90 మందికి వైద్య సేవలు  అందించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది మరియు రక్త పరీక్షలు 41 చెయ్యిడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ర్ పి ఎస్. గోవిందరావు గారు   మాట్లాడుతూ హెచ్.ఐ.వి. సుఖ వ్యాధులు మరియు టీబీ వ్యాధుల పైన అవగాహన కల్పించడం జరిగింది .ప్రతి ఒక్కరూ హెచ్.ఐ.వి స్థితి తెలుసుకొని రక్త పరీక్షలు చేసుకోవాల్సిందిగా తెలియజేయండo జరిగింది.     మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వ్యాధులు పైన గ్రామస్తులు అవగాహన కల్పించడం జరిగింది వ్యాధుల పైన గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది.  ఈ  కార్యక్రమంలో సి హెచ్ ఓ జాశ్వంత్ గారు, హెచ్ ఏ.  ఏ ఎన్ ఎస్. కే. బాజియా గారు ఆశ రత్నం, జానకి మరియు సిఎల్ డబల్యు మ్. జ్యోతి ,గ్రామ ప్రజలు, యూత్ మొదలైన వారు పాల్గొన్నారు.