అచ్చెన్నాయుడు పై ఆగ్రహించిన జన సైనికులు?
05-02-2025 19:35:28
అచ్చెన్నాయుడు పై ఆగ్రహించిన జన సైనికులు?
పి .గన్నవరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 5:
పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇంచార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.బూత్ కన్వీనర్లకు ఇంచార్జ్ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు దిశా నిర్దేశం చేస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేసే విషయంలో, రైల్వే జోన్, డివిజన్, రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలోనూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కువ ప్రస్తావించడం జరిగింది.పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించకపోవడంతో జనసైనికులు ఇంచార్జి మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన కార్యకర్తలు మధ్య వాదనలు మొదలు అవుతున్న సమయంలో స్థానిక శాసనసభ్యులు, గిడ్డి సత్యనారాయణ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంచార్జ్ మంత్రి, కింజరాపు అచ్చెన్నాయుడు వెంటనే ఉలిక్కిపడి కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పురందేశ్వరి ముగ్గురు కలయికే కూటమి అని,పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్డీఏ లేదని సభను తొందరగా ముగించారు.