Sidebar


Welcome to Vizag Express
కూనేరు చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ ఎస్వి.మాధవరెడ్డి

05-02-2025 19:37:54

కూనేరు చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ ఎస్వి.మాధవరెడ్డి
పార్వతీపురం/కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5:
గంజాయి,నాటుసారా,అక్రమ కలప రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూనేరు చెక్ పోస్టును బుధవారం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్  ఆకస్మిక తనిఖీ చేసారు. చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు ఏవిధంగా చేపడుతున్నది, ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న రికార్డులును తనిఖీ చేశారు.అదేవిధంగాచెక్ పోస్ట్ వద్దఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని, చెక్ పోస్ట్ చుట్టుపక్కల వున్న చిన్న,చిన్న రహదారుల మీద కూడా ద్రుష్టి సారించాలని సిబ్బందిని జిల్లా ఎస్పీ  ఆదేశించారు. కూనేరు చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమారాలను,వాటి పనితీరును పర్యవేక్షించారు.
అనంతరం కొమరాడ పోలీసు స్టేషన్ ను సందర్శించి పలు ముఖ్యమైన రికార్డుల నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించి,రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు.  స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలు పర్యవేక్షిస్తూ,భద్రతా ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొని అధికారులకి తగు సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై నీలకంఠం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.