Sidebar


Welcome to Vizag Express
అమలు కాబోతున్న లేబర్ కోడ్ లు కార్మికులకు నష్టం

05-02-2025 19:42:09

అమలు కాబోతున్న లేబర్ కోడ్ లు కార్మికులకు నష్టం
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5:
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న  నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలిని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చింతకాయల శివాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు నష్టదాయకంగా తీసుకొస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ లను ఏప్రిల్ నుండి అమలు చేయాలని కుట్రలు పన్నుతున్నాదని లేబర్ కోడ్ లు గాని అమలు అయితే కార్మికులకు పనిగంటలు పెరగడం , జీతాలు పెంచమనే హక్కుతో పాటుగా కార్మికులు మిగతా హక్కులు కోల్పోతారు. అందువలన కార్మిక  వర్గం  లేబర్ కోడ్ లు రద్దుకై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని ,గతంలో రైతులకు నష్టదాయకమైన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి నల్ల చట్టాలను రద్దు చేయించుకున్నారన్న విషయం గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జానకి, శ్రీనివాస్, వరలక్ష్మి, ప్రసన్న, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.