బెల్లం తయారీని దృష్టిలో పెట్టుకొని చెరుకు పండించాలి
-కొక్కిరాపల్లి,తురంగలపాలెంలలో పొలం పిలుస్తుంది
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 5:
అధిక రసము కలిగి ఉన్న చెరుకు రకములను రైతులు వేయాలని బుధవారం మండలంలో కొక్కిరాపల్లి, తురంగలపాలెం గ్రామాలలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి మోహనరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ బెల్లం తయారీని దృష్టిలో పెట్టుకొని రైతులు అధిక రసం కలిగే చెరుకు రకములను వేసుకోవాలని,అనకాపల్లి చెరుకు పరిశోధన కేంద్రములో కొత్త రకములు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని పండిస్తే బెల్లం దిమ్మలకి మంచి గిరాకీ ఉన్నందున లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే చెరుకు పంట వేసిన 4 నెలల వరకు అంతర పంటలుగా మినుము, పెసలు వేసుకోవడం వలన ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం కలదన్నారు.అలాగే మండలములో వరి రెండవ పంట సుమారుగా 25 ఎకరాలలో వేశారని,ఖరీఫ్ పంట కాలంతో పోలిస్తే రబీ లో ఎరువులు 30 శాతం అదనంగా వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ గ్రామ సహాయకులు అరుణ, చెరుకు రైతులు రమణ,కృష్ణ, వరి వేసే రైతులు ఆదినారాయణ,తోట గణేష్,భీముని రమణ తదితరులు పాల్గొన్నారు.