Sidebar


Welcome to Vizag Express
అల్లూరి పార్కును సందర్శించిన జడ్పీ సీఈవో

05-02-2025 19:44:41

అల్లూరి పార్కును సందర్శించిన జడ్పీ సీఈవో 
పి.నారాయణ మూర్తి 
 
 గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5: 
 అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం  లో  అల్లూరి సీతారామరాజు స్మారక మందిరాన్ని  ఉమ్మడి విశాఖ  జిల్లా పరిషత్ సీఈఓ పి నారాయణమూర్తి బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గంటం దొర సమాధులపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్క్ ను అల్లూరి విగ్రహాలను సందర్శించి అల్లూరి జీవిత చరిత్ర చిత్రపటాలను పరిశీలించారు ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ నారాయణమూర్తిని కలసిన స్థానిక విలేకరులు అల్లూరి పార్కులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలపగా ఆయన స్పందిస్తూఅల్లూరి సీతారామరాజు పార్కును వివిధ ప్రాంతాల నుండి వచ్చి అధిక సంఖ్యలో సందర్శించే పర్యాటకులకు త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా లింగంపేట, ఏటి గైరంపేట భారీ మంచినీటి పథకాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ముందస్తుగా ఏఏ గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉందని అధికారుల ద్వారా తెలుసుకొని తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ఏడాది భారీ మంచినీటి పథకాలకు మెయింటినెన్స్ నిమిత్తం 28 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం గొలుగొండ మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మేరి రోజ్, ఈవోఆర్డి కే.శ్రీనివాస్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.