Sidebar


Welcome to Vizag Express
అధిక లోడ్ తో ప్రయాణిస్తున్న లారీలకు జరిమానా

05-02-2025 19:46:06

అధిక లోడ్ తో ప్రయాణిస్తున్న లారీలకు జరిమానా
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5:
అధిక లోడుతో వెళ్తున్న లారీలకు అధికారులు జరిమానా విధించారు.యలమంచిలి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం అధిక లోడ్ తో ప్రయాణిస్తున్న రెండు లారీలను ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ గుర్తించి, ఆర్టివో కి అప్పగించగా ఒక లారీకి రూ.60వేలు,మరొక లారీకి రూ.50వేల రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అధిక లోడ్ లతో ప్రయాణిస్తున్న వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే ప్రతీ వాహన దారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.