కోర్టు ఉత్తర్వులతో ఆక్రమణలు తొలగింపు
గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5:
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చోద్యం జంక్షన్లో కోర్టు ఉత్తర్వులు ఆధారంగా చేసుకుని ఆర్ అండ్ బి స్థలంలో ఉన్న ఆక్రమణలను బుధవారం అధికారులు తొలగించారు.
తన జిరాయితి భూమిలో ఆర్ అండ్ బి స్థలానికి అనుకొని రెండు పూరిపాకలు వేసి ఆక్రమణ చేసిన ఇద్దరిని ఆ స్థలం నుండి తొలగించాలని చోద్యం గ్రామానికి చెందిన మద్దపు కామునాయుడు గతంలో కోర్టును ఆశ్రయించగా . ఆక్రమణ తొలగించాలంటూ రెండు సంవత్సరాల క్రితం అధికారులకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అప్పటినుండి ఆక్రమణదారులకు ప్రభుత్వ అధికారులు పలుమార్లు నోటీసులు అందజేసి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు ఖాళీ చేయలేదు. ఆర్ అండ్ బి జె ఈ ప్రసాద్ మండల రెవెన్యూ అధికారులు గొలుగొండ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో కేడీపేట పోలీస్ సిబ్బంది కలసి ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణ తొలగించమని రెవెన్యూ ఆర్ అండ్ బి అధికారులు ఉదయం 10 గంటల సమయంలో లబ్ధిదారులకు చెప్పినప్పటికీ వారు ఖాళీ చేయమని అధికారులను వ్యతిరేకించారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు పోలీసు సిబ్బందికి తెలియజేసి వారి సమక్షంలో ఆక్రమణలు తొలగించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, వీఆర్వోలు గోవర్ధన్, మోహన దుర్గా, శ్రీనివాసరావులు, వీఆర్ఏలు రమణ,, నరేంద్ర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు