Sidebar


Welcome to Vizag Express
పాడి పరిశ్రమతో కుటుంబ పోషణ

05-02-2025 20:07:16

పాడి పరిశ్రమతో కుటుంబ పోషణ

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 5: 

పాడి పరిశ్రమతో కుటుంబ పోషణ నిర్వహిస్తున్న కేసరపాడు గ్రామానికి చెందిన ఇప్పీలి  సురేష్ ను స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి  గోసాలకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఇప్పిలి సురేష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేసి చివరకు పాడి పరిశ్రమ వైపు దృష్టి సారించడంతో ఆర్థిక పరిపుష్టి దిశగా తీసుకున్న నిర్ణయాన్ని దేవదాస్ రెడ్డి కొనియాడారు. సురేష్ నిర్వహిస్తున్న పాడి పరిశ్రమ ద్వారా 12 ఆవులను పెంచుకుంటూ రోజు 90 నుండి 100 లీటర్ల పాలన సేకరిస్తూ వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో సగం పెట్టుబడి పోను మరో సగం కుటుంబ పోషణ మిగులుతుందని ఇతర ప్రాంతాలకు తక్కువ జీతాలకే వెళ్లి కుటుంబానికి దూరంగా ఉంటూ అనేక శ్రమలు పడడం కన్నా గ్రామంలోనే ఉంటూ ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చేసుకుంటూ కుటుంబానికి చేదోడు  వాదోడుగా  నిలుస్తూ   పాడి పరిశ్రమ రంగంలో  ముందడుగు వేస్తున్న సురేష్ ను ఆదర్శంగా తీసుకోవాలని దేవదాస్ రెడ్డి కొనియాడారు. పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులను బట్టి వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.