Sidebar


Welcome to Vizag Express
బడ్జెట్ ప్రతులు దగ్ధం

05-02-2025 20:08:22

బడ్జెట్ ప్రతులు దగ్ధం

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 5:

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా బుధవారం మాకన్నాపల్లి గ్రామంలో 2025 26 బడ్జెట్ కాపీలను ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో దహనం చేసారు. ఈ సందర్భంగా జీడిరైతు సంఘం కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయ రంగానికి గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు తగ్గించడం, కొత్త సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. జీడిపంటను కేంద్ర పంటల జాబితాలో చేర్చి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు తెప్పల అప్పలస్వామి, గేదెల నీలకంఠం, బత్తిన ప్రసాద్, తెప్పల రాజు, జుత్తు వరలక్ష్మి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు