Sidebar


Welcome to Vizag Express
పిడిఎఫ్ అభ్యర్థిగా విజయ గౌరి నామినేషన్ కి తరలిరండి!

05-02-2025 20:09:57

పిడిఎఫ్ అభ్యర్థిగా విజయ గౌరి నామినేషన్ కి తరలిరండి!

యుటిఎఫ్ పిలుపు

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి5:

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ యుటిఎఫ్ బలపరిచిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరి నామినేషన్ కార్యక్రమం విశాఖపట్నం జగదంబ జంక్షన్ సరస్వతి పార్క్ నుండి ఉదయం ర్యాలీ ప్రారంభమై 11 గం.కి  కలెక్టర్ కార్యాలయం లో జరగబోవు నామినేషన్ కు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని  యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, జిల్లా కార్యదర్శి గున్న రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ గుంట కోదండరావు అకాడమిక్ సెల్ కన్వీనర్ ఎల్ వెంకటాచలం ,సీనియర్ నాయకులు గొండు మధుసూదనరావులు కోరారు. బుధవారం మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్ బడిత్య దాసరి ఈశ్వరరావు, పి జగన్ మోహన్ రావు తదితరులు మ మందస మండలంలోని జి ఆర్ పురం, సోండిపూడి, కొత్తపల్లి ఉన్నత పాఠశాలలు, మందస ఆశ్రమ పాఠశాల, జి ఆర్ పురం, కేజీబీవీ, మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల , సాంఘిక సంక్షేమ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరెడ్ల విజయ గౌరీ గారు విద్యార్థి నాయకురాలుగా, ఉపాధ్యాయ ఉద్యమ నేతగా విద్యారంగానికి తమ యొక్క సేవలను అందిస్తూ ఉన్నారని, వారి గెలుపు విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంక్షేమానికి తోడ్పాటు ఇస్తుందని తెలిపారు. అధ్యాపక,ఉపాధ్యాయ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న అభ్యర్థి విజయ గౌరి కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు. అధికార దర్పానికి దూరంగా ఉన్నారు. సామాన్య ప్రజలలో ఒకరిగా ఉంటున్నారు.కెజిబివి, రెసిడెన్షియల్ పాఠశాలల టీచర్ల సమస్యలు, అప్రెంటీస్ విధానం రద్దు, ఆ సర్వీస్కు పెన్షన్, నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన మరియు మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ టీచర్లకు 010 హెడ్ ద్వారా జీతాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల మినిమమ్ టైమ్ స్కేల్, మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్, ఇలా ప్రతి సమస్య పరిష్కారంలో సంఘాలకు అండగా నిలిచారని, పోరాటాలకు ముందున్నారని  తెలియజేశారు.
 ఉపాధ్యాయులఈ కార్యక్రమంలో  కళాశాలల ప్రిన్సిపల్స్ బి తేజేశ్వరరావు, చింతాడ శరత్ బాబు, దొక్కరి దుర్యోధన, ఎల్ లక్ష్మి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ యర్రం నాయుడు, వసంత , ఎస్ రామారావు, అనిల్ సాల్మన్ రాజు, ఎస్ గణేష్ ,  తదితరులు పాల్గొన్నారు.