Sidebar


Welcome to Vizag Express
లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాల ధర్నా.....

05-02-2025 20:13:31

లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాల ధర్నా.....


సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 5:


కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చేసిందని , ఈ  కోడ్ లను రాష్ట్రలు కూడా అమలు చేయాలని కేంద్రం వత్తిడి చేస్తుందని , దీంతో కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 5 వ తేదీన దేశ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు జరపాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలాస రెవిన్యూ డివిజన్ పరిధిలో గల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐసీసీటియు అనుబంధ కార్మికులు ఆర్ డి ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా పలాస జి జే కాలేజీ జంక్షన్ నుండి ఆర్ డి  ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ధర్నా నుద్దెశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి,యస్ లక్ష్మీనారాయణ,ఏఐటీయూసీ నాయకులు సి హెచ్ వేణుగోపాల్, ఏఐసీసీటీయు నాయకులు    కామేశ్వరరావు,తదితరులు మాట్లాడుతూ కార్మికులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లు తెచ్చిందని తెలిపారు. మోడీ భజన చేస్తున్న రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి తీసిపోమని దాని అడుగుజాడల్లోనే నడుస్తూ లేబర్ కోడ్ లు రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధం అవుతుందని విమర్శించారు. ఇప్పటికే కార్మిక శాఖ కోరలు తీసేసి  ఆశాఖ అధికారులను యజమానుల దళారులుగా మార్చేసిందని ద్వజమేత్తారు. దీని వల్ల కార్మికులకు హక్కులు గాని, చట్టపరమైన సంక్షేమ చర్యలు గాని అమలు కాక కట్టు బానిసలుగా కార్మికులు బతుకుతున్నారని వివరించారు. ఉన్న హక్కులు కూడా తీసేసి మరింత బానిసత్వంలోకి నెట్టెందుకే ఈ లేబర్ కోడ్ లని వివరించారు. కనీస వేతనాలు, పని గంటలు, పి యఫ్, ఇ యస్ ఐ, గ్రాడ్యూటి, బోనస్ వంటి వాటికి ఇప్పటికీ భరోసా లేకుండా చేశారని ఇవి అమలైతే కార్మికులు మరింత దౌర్భాగ్యం అనుభవిస్తారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా లేబర్ కోడ్ లు రద్దు చేసి, కార్మిక అనుకూల విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆర్ డి ఓ ఎ ఓ గారికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె కేశవరావు, ఎన్ మోహనరావు, రైస్ మిల్లు కార్మిక సంఘం నాయకులు కె బాలకృష్ణ, బి దుర్యోధన, ఆర్ ఏకాశీ, టి లక్ష్మీనారాయణ, బి వెంకటేశం,జీడి కార్మిక సంఘం నాయకులు సి హెచ్ జానకమ్మ,జి బాలమ్మ, బి చంద్రావతి, కుసుమ ఆశ యూనియన్ నాయకులు యం లావణ్య,మంజు, రాణి, మధ్యాహ్నం భోజనం పధకం కార్మిక సంఘం నాయకులు బి శశిరేఖ, వై మనమ్మ, భారతి, హమాలీ సంఘం నాయకులు ఎ క్రిష్ణారావు,రమేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు బి సునీత, సీతామహాలక్షి పాణిగ్రాహి, కాంచన, జయలక్ష్మి, పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులు టీ అజయ్ కుమార్, జుత్తు సింహాచలం, కె సింహాచలం టి సన్యాసిరావు లు పాల్గొని మాట్లాడుతూ సంఘీభావం తెలిపారు.ఈ ధర్నా లో ఆ యా సంఘాల కార్మికులు పాల్గొన్నారు.