8 నుంచి బొరివంకలో నాటక పరిషత్ పోటీలు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 5:
: ఈనెల 8, 9, 10 తేదీల్లో ఆహ్వానిత ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళింగ సీమ కళాపీఠం అధ్యక్షులు బల్లెడ లక్ష్మణ మూర్తి మాస్టారు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కవిటి మండలం బొరివంక కేంద్రంగా బల్లెడ అనసూయమ్మ స్మారక ఆహ్వానిత నాటికి పోటీల్లో ....
8వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు గుంటూరు జిల్లా వారి జనరల్ బోగీలు మరియు అదే రోజు రాత్రి 9 గంటలకు తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత? అన్న నాటికలు ప్రదర్శింపబడునని తెలిపారు.
9వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు పండు క్రియేషన్స్ కొప్పోలు (ఒంగోలు) వారి పక్కింటి మొగుడు నాటికను ప్రదర్శింపబడును. అనంతరం అదే రోజు రాత్రి 9 గంటలకు అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం అనే నాటిక ప్రదర్శింపబడును
10వ తేదీ సోమవారం రాత్రి 7 గంటలకు అభినయ ఆర్ట్స్ - గుంటూరు వారి ఇంద్ర ప్రస్తం నాటిక ప్రదర్శించిన అనంతరం అదే రోజు రాత్రి 9 గంటలకు సౌజన్య కళా స్రవంతి ఉత్తరాంధ్ర వారి దేవరాగం నాటికను ప్రదర్శింపబడును