Sidebar


Welcome to Vizag Express
బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయం లో జరిగిన రోడ్డు ప్రమాదం

06-02-2025 21:02:18

చీపురుపల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 6 : చీపురుపల్లి నుండి గరివిడి వెల్లే ప్రధాన రహదారిలో నాయుడు కళ్యాణ మండపం సమీపంలో బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ ఢీకొని చీపురుపల్లి మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన దన్నాన  శ్రీను (35) అనే ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. చీపురుపల్లి పోలీసుల కథనం మేరకు విజయరాంపురం గ్రామానికి చెందిన దన్నాన శ్రీను విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనోపాధిని కొనసాగించుకుంటున్నాడు. బుధవారం రాత్రి వైజాగ్ నుండి డిఎంయుకు చీపురుపల్లి కి చేరుకొని చీపురుపల్లి నుండి గుర్ల మండలం గుజ్జింగివలస ఊర్లో గల తమ అత్తవారింటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చీపురుపల్లి పట్టణ శివార్లలో నాయుడు కళ్యాణ మండపం వద్ద ట్రాక్టర్ తప్పించుకోగా ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనుకి బలమైన గాయాలు తగలడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు కలిగి ఉండడంతో కుటుంబం అతనిపై ఆధారపడి జీవిస్తుందంటూ కుటుంబ సభ్యులంతా కన్నీరు, మున్నేరుగా  విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాదమునకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు, ట్రాక్టర్ ను కూడా అదుపులోకి  తీసుకొని చీపురుపల్లి ఎస్.ఐ ఎల్. దామోదర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.