ఉభయ గోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించాలి. Vఏపీ మార్కపెడ్ చైర్మన్.
వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి06
ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి "పేరాబత్తుల రాజశేఖర్ విజయం చేకూర్చాలని అమలాపురం నియోజకవర్గం ఎంఎల్ఏ ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ రాష్ట్ర మార్క్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధినీ ప్రోత్సహిస్తూ నిరుద్యోగ పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కూటమి అభ్యర్థిని మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ దగ్గరకి మనం కనీసం మూడుసార్లు ఆయన వెళ్ళాలనీ సూచించారు.సమావేశం అనంతరం అమలాపురం సిటీలో కామనగురువు ప్రాంతంలో పట్టభద్రులను కలిసి వారికి కూటమి అభ్యర్థిని మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గారు మరియు ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మెన్ కర్రోతు బంగార్రాజు పట్టభద్రులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీ పెచ్చెట్టి చంద్రమౌళి , అబ్జర్వర్ పెచ్చెట్టి బాబు, స్థానిక జనసేన, బీజేపీ నాయకులు, పూసపాటిరేగ మాజీ జడ్పిటిసి ఆకిర ప్రసాద్ రావు, క్లస్టర్ ఇన్చార్జి భూలోక దంగా పాల్గొన్నారు.