Sidebar


Welcome to Vizag Express
ఖండ్యం లో టి.బి రహిత భారత్ కార్యక్రమం,

06-02-2025 21:06:11

ఖండ్యం లో టి.బి రహిత భారత్ కార్యక్రమం,
రేగిడి ఫిబ్రవరి 6 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
       రేగిడి ఆమదాలవలస మండలం ఖండ్యం గ్రామం లో  భారత దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మరియు ఆయుష్ శాఖ సలహా మేరకు ఖండ్యం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి ఎం. సునీల్ కుమార్ ఆధ్వర్యం లో టి.బి. రహిత భారత్ కార్యక్రమo నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈరోజుకు 100 రోజులు పూర్తయ్యాయని,ప్రజలందరూ టి.బి. వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలని,టి.బి. ని చికిత్స ద్వారానే కాకుండా నివారణ ద్వారా కూడా ఓడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. హెచ్. పి.సుఖి, ఏఎన్ఎం స్వాతి, ఆశ వర్కర్లు, నక్క హేమలత పాల్గొన్నారు