Sidebar


Welcome to Vizag Express
అరకు రైల్వే స్టేషన్ ను వాల్తేరు రైల్వే డివిజన్ లో కొనసాగించాలి

06-02-2025 21:07:30

అరకు రైల్వే స్టేషన్ ను వాల్తేరు రైల్వే డివిజన్ లో కొనసాగించాలి

అరకు ఎంపీ గుమ్మ తనుజ రాణి

అరకులోయ,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,06: వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న అరుకు రైల్వే ఒరిస్సా రాయగాడ్ డివిజన్ కు విభజించే ప్రతిపాదనను పునః పరిశీలన చేయాలని కిరండోల్ లైనులేని వాల్తేరు డివిజన్ ఊహించుకోలేమని భారత ప్రభుత్వ రైల్వే మరియు ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కు గురువారం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అరుకు (విశాఖపట్టణం) యొక్క పర్యాటక భూభాగంలో అంతర్భాగంగా ఉందని వాల్తేరు డివిజన్ నుండి వేరు చేయడం బిడ్డను తల్లి నుండి వేరు చేసినట్టే అవుతుందని ఉత్తర తీరా ప్రాంతంలోని ఆదివాసి గిరిజన కుటుంబాలు తమ జీవనోపాధి కోసం పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడతాయని అలాగే ఈ పర్యావరణ వ్యవస్థకు ఏదైనా అంతరాయం ఏర్పడితే అది వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుందని అరుకు డివిజనల్ ఎంటర్ చేంజ్ పాయింట్ కి అత్యంత అనుకూలమైన ప్రదేశమని ఇది సరైన కార్యచరణ సాధ్యత వ్యూహాత్మక సిబ్బందిని మార్చే పాయింట్ ను అందిస్తుందని దీని భౌగోళిక స్థానం ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు దీనిని సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలకు అనువైన కేంద్రంగా మార్చాయని ఈ ఆందోళనల దృశ్య అరుకు ను వాల్తేరు డివిజన్ నుండి విభజించే ప్రతిపాదనను పునః పరిశీలించవలసిందిగా వినతిపత్రం సమర్పించమని డా||గుమ్మ తనూజరాణి అన్నారు. వాల్తేరు డివిజన్ రైల్వే సమస్యను విన్న భారత ప్రభుత్వ రైల్వే శాఖ మంత్రి శ అశ్వని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి పునః పరిశీలన జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇదివరకే అరుకు రైల్వే రిక్వెస్ట్ స్టాప్ లో పాసింజర్ రైలు నిలుపుదల కోసం డిఆర్ఎం ఇతర రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను గురువారం భారత రైల్వే శాఖ మంత్రి కి నేరుగా! వినతి పత్రం సమర్పించి తెలపటంతో సంబంధిత రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అరుకు రైల్వే స్టేషన్ -1 అలాగే అరుకు రైల్వే రిక్వెస్ట్ స్టాఫ్ (మిని స్టేషన్) త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను చరవాణి ద్వారా ఆదేశించారని ఆమె తెలిపారు.అరుకు ఎంపీ గారి యొక్క ప్రత్యేక చొరవతో అరకు రైల్వే రిక్వెస్ట్ స్టాప్ సమస్య పరిష్కారం రైల్వే రిక్వెస్ట్ స్టాప్ సమస్యను పరిష్కార మార్గం చూపించినందుకు మంత్రి కు ధన్యవాదాలు తెలిపిన అరకు ఎంపీ గ ఈ సందర్భంగా మంత్రి గారు తమ పరిధిలో రైల్వే సమస్యలు ఏమైనా ఉన్నా నేరుగా నన్ను సంప్రదించగలరని తన యొక్క చారవాణి ఫోన్ నంబరు తీసుకోవడం జరిగిందన్నారు.