Sidebar


Welcome to Vizag Express
సమతా రోటరీ క్లబ్ వితరణ

06-02-2025 21:14:10

సమతా రోటరీ క్లబ్ వితరణ గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 6,                  గాజువాక సమత రోటరీ క్లబ్
ఆధ్వర్యంలో 72వ వార్డు సమతా నగర్ లో రోటరీ  ఫ్రీ హోమియో క్లినిక్ లో   క్లినిక్ చైర్మెన్ కీర్తిశేషులు రొటేరియన్ విక్టర్ రాజు వర్ధంతి సందర్భంగా రోటరీ క్లబ్ మెంబర్స్ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంధులకు స్మార్ట్ విజన్ కళ్ళజోళ్ళు  రోటరీ క్లబ్ సౌజన్యంతో ఉచితంగా ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సిరట్ల శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ ఒక్కొక్క కళ్లద్దాలు సుమారు 30 వేల రూపాయలు ఉంటాయని, ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల చూపు లేని వారికి 75% చూపు ఉన్నట్టు లెక్క అని స్మార్ట్ ఫోన్ కు అనుసంధానమై ఈ కళ్లద్దాలు పనిచేస్తాయని చెప్పారు. తదుపరి విక్టర్ రాజు గారి కుటుంబ సభ్యులు సుమారు 30 మంది పేదవారికి చీరలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు లక్ష్మణరావు, సూర్యనారాయణ, హేమంత్, గౌరీ,  వెంకట్రావు మరయు కుటుంబ సభ్యులు విజయ్, వినోద్, విజేత  యోగ సభ్యులు, సమతా నగర్ కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు