ఓటమికి చెందిన కార్యకర్తలు కండువా మార్చినందుకే? ప్రస్తుతం కూటమిలో.. రచ్చా?
పి.గన్నవరం, వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 6:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అచ్చెన్నాయుడు పై పవన్ కళ్యాణ్ పేరు పలకలేదని న్యేపంతో ఒకే కుటుంబంలా కలిసున్నా కూటమి కార్యకర్తలు మధ్య చిచ్చు పెట్టి
ఇన్చార్జ్ మంత్రి అచ్చం నాయుడు చిన్నబోయేలా రాద్ధాంతం చేశారు.దీనంతటికీ గతంలో ఓటమి పార్టీకి చెందిన కొందరు జనసేన పార్టీలో చేరి, నక్క బుద్ధి చూపించడమేకాక. జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి, అచ్చెన్నాయుడు పై విమర్శలు చేస్తూ, పార్టీ విచ్ఛిన్నమయ్యేలా పథకాలు వేస్తూ, అమాయక కార్యకర్తలను వారంతట వారు నీట మునిగేలా చేస్తూనే ఉన్న జనసేన కార్యకర్తలు గుర్తించటం లేదంటూ విమర్శలు వెలువడుతున్నాయి.
అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు నోరు మెదపట్లేదు, అయినప్పటికీ నిజంగా డిప్యూటీ సీఎం విశ్వాస పాత్రులు గీసినా గీత దాటకుండా, స్వలాభం చూడకుండా, అహర్నిశలు కష్టపడి, సొంత నిధులు ఖర్చుచేసి, పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు ఎందరో ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఓటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేలా కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టి సునకానందం పొందుతున్నారని విమర్శలు వెలువడుతున్నాయి.