స్టీల్ టి ఎన్ టి యు సి లో చేరిన ఉక్కు కార్మికులు
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 6,
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో స్టీల్ టి ఎన్ టి యు సి యూనియన్ లో చేరిన ఉక్కు కార్మికులు
ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉక్కును కాపాడుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఉక్కుకు 11440 కోట్లను ప్యాకేజీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ టిఎన్టియుసి ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు తెలియజేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు 500 కోట్ల రూపాయలు ఒకసారి 1140 కోట్ల ఒకసారి అలాగే 11440 కోట్ల రూపాయలను ఇచ్చి అలాగే రాష్ట్రంలో ఉన్న గనులు రెన్యువల్ చేయించి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకుండా ఆపించి పవర్ బిల్లు మరియు వాటర్ బిల్లుకు వెసులుబాటు కలిపించి అన్ని విధాల ఆదుకున్నామని అన్నారు అలాగే ప్లాంట్లో టి ఎన్ టి యు సి యూనియన్ బలోపేతానికి కార్మిక వర్గం కదలి రావాలని పిలుపునిస్తూ ఇకపై విశాఖ ఉక్కులో ఒక్కటే టి ఎన్ టి యు సి ఉందని తెలియజేస్తూ విశాఖ ఉక్కు లో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఉద్యోగులందరూ టిఎన్టియుసిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంనికి స్టీల్ టీ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనువాసు రాష్ట్ర టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి కోగంటి బాబు స్టీల్ టి ఎన్ టి యు సి అధ్యక్షులు గుమ్మడి నరేంద్ర కుమార్ ఉపాధ్యక్షులు పెద్దాడ సోమినాయుడు కొల్లి శివ నాగేశ్వరరావు మండవ రఘప్రసాద్ మరియు నూతనంగా చేరిన ఎన్ లక్ష్మణరావు ఎన్ రాంబాబు పప్పల రాజేష్ కె రాజు ఎస్ రవి ఎం జగదీష్ ఎన్ సత్యారావు జే శ్రీనువాసరావు కె రాజబాబు తదితరులు పాల్గొన్నారు