Sidebar


Welcome to Vizag Express
డోక్రా సంఘాల్లో ఉన్న సభ్యులు నిరక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన ఎంపీడీవో వి. జానకి

06-02-2025 21:20:06

 డోక్రా సంఘాల్లో ఉన్న సభ్యులు నిరక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన ఎంపీడీవో వి. జానకి


 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 6.

          ఆనందపురం మండలంలో డోకార సంఘాలు సభ్యులను నిరక్షరాశులను అక్షరాసులుగా తీర్చి దిద్దిన ఆనందపురం ఎంపీడీవో  వెలుగు కార్యాలయంలో విద్యా సామగ్రిని అందిస్తున్న ఎంపీడీవో డాక్టర్. వి. జానకి, ఆనందపురం మండలం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా  గ్రామాల్లోని నిరక్షరాస్యులను వీవోఏలు నిర్వ హించే తరగతుల ద్వారా అక్షరాస్యులుగా తీర్చి దిద్దనున్నట్టు ఎంపీడీవో డాక్టర్. వి. జానకి తెలిపారు. ఆనందపురం మండలం వెలుగు కార్యాలయం లో సోమవారం ఉల్లాస్ కార్యక్రమానికి సంబంధించి వాలంటరీ టీచర్లకు తరగతులను ఏ విధంగా నిర్వహించాలో  శిక్షణతో  పాటు అభ్యసనా సామగ్రిని ఎంపీడీవో డాక్టర్. వి. జానకి  అందించారు. ఈ తరగతులను ప్రతి గ్రామంలోను నిర్దేశించిన ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి 9 గం టల వరకూ క్రమ పద్ధతిలో  నిర్వహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం ఎస్. ఆదినారాయణ, డోక్రా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.