Sidebar


Welcome to Vizag Express
దేవరాపల్లి, తామారబ్బ యూపి స్కూల్ ను హస్టల్ తో కూడిన హైస్కూల్ గా అప్ గ్రేడ్ చేసి గిరిజనులకు మెరుగైన విద్యను అందించాలని

06-02-2025 21:26:50

దేవరాపల్లి, తామారబ్బ యూపి స్కూల్ ను హస్టల్ తో కూడిన  హైస్కూల్ గా అప్ గ్రేడ్ చేసి గిరిజనులకు మెరుగైన విద్యను అందించాలని.  దేవరాపల్లి, వైజాగ్ ఎక్స ప్రెస్, ఫిబ్రవరి 6:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వాన్ని డిమాండ్ గురువారం  స్థానిక సిఐటియు కార్యాలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడారు,తామారబ్బ పంచాయితీ లో 9 గిరిజన గ్రామాలు చింతలపూడి పంచాయతీ లో 11 గ్రామాలు ఉన్నాయని తెలిపారు,ఈ గ్రామాలు పరిదిలో 7 ప్రాదిమిక పాఠశాలలు 1 యూపి స్కూల్ ఉందని తెలిపారు ఈపాఠశాలల్లో ఐదవ తరగతి పూర్తి చేసుకోని పై చదువులు కోరకు  అత్యధిక మంది దూర ప్రాంతాలకు,వెళ్ళ వలసి వస్తుందని తెలిపారు, తామారబ్బ యూపీ స్కూల్ లో 7 వ తరగతి వరకు చదువు కోని మరలా వెరె ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని తెలిపారు అందుకని యూపీ స్కూల్ పై ఎక్కువ మంది మొగ్గు చూపడం లేదన్నారు,దీని వలన అత్యధిక మంది చదువులకు దూర మయ్యి  నిరాక్షరాస్యులుగా మిగిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈపంచాయితీ లో చదువుకోని ఉపాధి పోందిన వారి సంఖ్య తక్కువ ఉందన్నారు, గిరిజనులకు మెరుగైన విద్య అందాలన్న ఈరెండు పంచాయతీ లో గిరిజనులు అబివృద్ది చేందాలంటే తామారబ్బ యూపీ స్కూల్ ను హస్టల్ తో కూడిన హైస్కూల్ గా అప్ గ్రేడ్ చేయాలని గిరిజనులను అబివృద్ది చేయాలని కోరారు జివో నెంబర్ 117 రద్దు చేయాలి విద్యా వ్యవస్థ ను చక్క దిద్దేకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం మంచిదే. కానీ ముందుగా జీవో 117ను రద్దు చేయాలి. గతంలో ఉన్నత పాఠశా లల్లో విలీనం చేసిన 3. 4. 5 తరతులను ప్రాధమిక పాఠ శాలలకు తీసుకు రానున్నట్టు మాత్రమే మార్గదర్శ కాల్లో పేర్కొ న్నారు. జీవో 1175 పేర్కొన్న ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తి విధా నాన్ని రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి.అవింగా ప్రభుత్వ చర్యలు చేపాట్టాలని వారు డిమాండ్ చేసారు ఈకార్యక్రమంలో జె ఈశ్వరావు  తామా‌ర్ల శంకర్రావు వి,దోంగబాబు తదితరులు పాల్గొన్నారు,