Sidebar


Welcome to Vizag Express
మంత్రులను కలిసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

06-02-2025 21:29:20

మంత్రులను కలిసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 6:
రోడ్డు విస్తరణ చేయాలంటూ రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖా మంత్రిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కోరారు.శుక్రవారం విజయవాడలో ఆర్ అండ్ బి  మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డిని ఆయన  కార్యాలయంలో యలమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా అనకాపల్లి-యలమంచిలి రోడ్డు విస్తరణతో పాటుగా నియోజకవర్గ గ్రామాల్లో గల అన్ని రోడ్లను అవసరం మేరకు వెడల్పు చేయాలని కోరారు.అలాగే రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి రాంబిల్లి మండలంలో గల ఏడుముళ్ల డ్యాం నిర్మాణంతో పాటూ నియోజకవర్గములో గల  పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.