గంగమ్మ పేట టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రంపై ప్రత్యేక నిఘా
06-02-2025 21:32:08
గంగమ్మ పేట టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రంపై ప్రత్యేక నిఘా
డిఈఓ తిరుపతి నాయుడు
వీరఘట్టం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,
ఫిబ్రవరి 6:
వీరఘట్టం బాలి కోన్నత పాఠశాలను డీఈవో తిరుపతి నాయుడు సందర్శించారు. ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లాలో 67 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను మార్చి 17 నుండి రాయనున్నారని తెలిపారు. వీటిలో 22 సి సెంటర్లు ఉండగా వీరఘట్టం మండలం గంగమ్మపేట పరీక్ష కేంద్రంపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది గట్టి నిఘా వేస్తున్నట్లు డీఈవో తెలిపారు. మిగిలిన సెంటర్లో కూడ ఎటువంటి అక్రమాలు లేకుండా పరీక్షలు నిర్వహించాలని పాఠశాల హెచ్ఎం లకు సూచించారు