Sidebar


Welcome to Vizag Express
ఇళ్ల స్థలాలు ఇచ్చి హామీ ని నిలబెట్టుకుంది

06-02-2025 21:34:57

ఇళ్ల స్థలాలు ఇచ్చి హామీ ని నిలబెట్టుకుంది 
- సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ 

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు చేసే వరకు అర్హులైన పేద ప్రజల పక్షాన నిలబడి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ తెలిపారు. గురువారం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవీఎంసీ జోన్ 2 మధురవాడ 7 వ వార్డు వాంబే కాలనీ ఇళ్ళు స్థలాలు కోసం వ్యక్తిగత ధరఖాస్తులు పూరించే కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా పట్టణాలలో 1 సెంటు, గ్రామాల్లో 1/12 సెంట్లు ఇచ్చినప్పుడు పేదలకు పిల్లలతో ఏమాత్రం సరిపోదని అవికూడా కొన్ని చోట్ల ఏమాత్రం ఉపయోగం లేనివి ఇచ్చారని సిపిఐ తరుపున మేము చెప్పామని అయన ఎవరిమాట వినకుండా ఇష్టం మొచ్చినట్లు ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 1 లక్షా 80 వేలు ఏమాత్రం ఇంటి నిర్మాణానికి సరిపోదని చెప్పినా వినలేదని విమర్శించారు.   ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 2,సెంట్లు 3 సెంట్లు స్థలాలుఇచ్చి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షలు రూపాయలు మంజురు చెయ్యాలని కోరామని వారు శానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఇళ్ళు లేని అర్హులైన పేదలందరికి ఇళ్ళు స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేవరకు సిపిఐ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం వాంబే కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని ఆరోగ్య కేంద్రం  నిర్వాహణ బాగుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, మధురవాడ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యురాలు ఎం ఎ బేగం, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు జె డి నాయుడు, బి కేశవయ్య, ఎం ఎస్ పాత్రుడు, కె జగ్గస్వామి తదితరులతో పాటు పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.